పెళ్లంటే నో అన్న శృతి హాసన్!

Published on Jan 24, 2021 8:23 pm IST

హీరోయిన్ శృతి హాసన్ కెరీర్ ఏమంత జోరుగా లేదు. స్టార్ హీరోయిన్ గా వెలుగుతున్న సమయంలో ఆమె లండన్ ప్రేమికుడు మైఖేల్ మాయలో పడి కెరీర్ ని నిర్లక్ష్యం చేశారు. అప్పట్లో ఆమె వచ్చిన అవకాశాలు కూడా వదులుకోవడం జరిగింది. లవ్ బ్రేకప్ తరువాత ఇండియా వచ్చి మరలా, సినిమాలపై ఫోకస్ పెట్టారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోవడంతో, శృతి హాసన్ కి స్టార్ హీరోల సరసన ఆఫర్స్ రావడం లేదు. వకీల్ సాబ్ లో పవన్ కి ఆమె జోడీగా నటించినప్పటికీ… అది కేవలం క్యామియో రోల్ లాంటిది మాత్రమే.

ఆమె హీరోయిన్ గా నటించిన క్రాక్ బ్లాక్ బస్టర్ టాక్ అందుకోవడం కొంచెం ఉపశమనం కలిగించే అంశం. కాగా ఇటీవల శృతి హాసన్ అభిమానులతో సోషల్ మీడియాలో ముచ్చటించారు. శృతి హాసన్ ని అభిమానులు అనేక ప్రశ్నలు అడుగగా సహనంగా సమాధానం చెప్పారు. ఓ నెటిజెన్ మీరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి నిజమేనా అని అడుగగా… అలాంటిది ఏమి లేదని శృతి తేల్చిపారేశారు. ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ని మీరు ద్వేషిస్తున్నారా అన్న ప్రశ్నకు… నాది అలాంటి తత్త్వం కాదని బదులు ఇచ్చారు. 34ఏళ్ల శృతి హాసన్ ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటుందో మరి.

సంబంధిత సమాచారం :