త్వరలోనే స్టార్ డైరెక్టర్‌తో త్రిష పెళ్లి?

Published on Jul 25, 2021 2:33 am IST


మూడు పదుల వయసులో కూడా స్టార్ హీరోయిన్లతో పోటీ పడి వరుస సినిమాల్లో బిజీ బిజీగా ఉన్న త్రిష పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కోలీవుడ్‌కు చెందిన ఓ స్టార్‌ డైరెక్టర్‌తో త్రిష ప్రేమలో పడిందని నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాదు వీరిద్దరి పెళ్లికి పెద్దలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలెక్కనున్నట్లు సమాచారం.

అయితే వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కిన ఓ మూవీ చిత్రీకరణ సమయంలోనే ప్రేమలో పడ్డట్టుగా మాట్లాడుకుంటున్నారు. ఇదిలా ఉంటే గతంలో ఓ వ్యాపారవేత్తతో త్రిషకి నిశ్చితార్థమైన విషయం తెలిసిందే. అయితే వారిద్దరికి మనస్పర్థలు రావడంతో నిశ్చితార్ధం జరగినా పెళ్లి మాత్రం జరగలేదు.

సంబంధిత సమాచారం :