తన కోరికను బయటపెట్టిన హీరోయిన్ !

Published on Oct 6, 2018 11:03 am IST

నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో రామ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘హలో గురు ప్రేమ కోసమే’. ఈ చిత్రం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఈ చిత్ర హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్‌ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికరమైన విషయాన్ని చెప్పారు. అనుపమాకి సింగర్ గా మారాలని బలమైన కోరిక ఉందట. ఏ సంగీత దర్శకుడైన ఆమెను సంప్రదించి, బాగా పాడమని ప్రోత్సహిస్తే మాత్రం, ఆమె తన సింగింగ్ టాలెంట్ చుపిస్తానంటుంది. ఖచ్చితంగా ఆ రోజు వస్తోందని కూడా చెబుతుంది. మొత్తానికి ఈ హీరోయిన్ కి సంగీతం పట్ల మంచి అభిరుచే ఉన్నట్లు ఉంది. మరి ఏ సంగీత దర్శకుడు అవకాశం ఇస్తాడో చూడాలి.

ఇక ఈ చిత్రంలో రామ్ – అనుపమా బావ మరదళ్లగా నటిస్తోన్నారు. అనుపమా తండ్రి పాత్రలో ప్రకాశ్‌రాజ్‌ నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్ కి రామ్ కి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను చాలా బాగా అలరిస్తాయట. ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్‌ 18న విడుదల చేయనున్నారు. ‘సినిమా చూపిస్తా మావ’ ‘నేను లోకల్’ లాంటి సక్సెస్ ఫుల్ చిత్రాలకు పని చేసిన టీమే, ఈ చిత్రానికి కూడా కలిసి పని చేస్తుండటంతో ఈ సినిమా పై కూడా భారీ అంచనాలే ఉన్నాయి.

సంబంధిత సమాచారం :