అల్లరి నరేష్ సినిమాలో హీరోయిన్ ఖారారు !

అల్లరి నరేష్ , భీమినేని శ్రీనివాస్ కాంబినేషన్లో రెండో సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. శ్రీ వసంత్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాలో చిత్ర శుక్ల హీరోయిన్ గా ఖరారయ్యింది. ‘రంగుల రాట్నం’ సినిమాలో నటించిన ఈ హీరోయిన్ తరువాత సినిమా ఇదే అవ్వడం విశేషం. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా లో సునీల్, నరేష్ ఫ్రెండ్స్ గా కనిపించబోతున్నారు.

వరుస పరాజయాల తరువాత అల్లరి నరేష్ మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకొని చేస్తున్న సినిమా ఇది. తెలుగులో ఉండే ప్రముఖ హాస్య నటీ, నటులందరు ఈ సినిమాలో ప్రేక్షకులను అలరించబోతున్నారు. హిట్ కాంబినేషన్లో వస్తోన్న సినిమా కావడంతో ఈ మూవీపై పాజిటివ్ బజ్ ఉంది. ఈ సినిమాతో పాటు అల్లరి నరేష్ ఏకే.ఎంటర్టైన్మెంట్స్ లో ఒక సినిమా చెయ్యబోతున్నాడు. అలాగే మహేష్ బాబు, వంశీ పైడిపల్లి కాంబినేషన్లో వస్తోన్న సినిమాలో ఈ హీరో ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు.