బిగ్‌బాస్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..!

Published on Aug 9, 2021 11:06 pm IST

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగులో ఇప్పటికే నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకోగా, త్వరలోనే ఐదో సీజన్ కూడా స్టార్ట్ కాబోతుంది. ఇటీవల ఐదో సీజన్‌ లోగోని కూడా నిర్వాహకులు విడుదల చేశారు. అయితే పరిస్థితులు కాస్త సర్ధుకుంటే సెప్టెంబర్ 5వ తేదిన ఈ షోను ప్రారంభించాలని నిర్వాహకులు భావిస్తున్నట్టు సమాచారం.

ఇదిలా ఉంటే ప్రతీ సీజన్ లాగానే ఈ సారి హౌస్‌లోకి వెళ్ళేది వీరే అంటూ పలు జాబితాలు కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్ప‌టికే ఆ జాబితాలో ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి, యాంక‌ర్ ర‌వి, వ‌ర్షిణి బిగ్‌బాస్ 5 ఎంట్రీపై ఓ క్లారిటీ ఇవ్వగా తాజాగా హీరోయిన్ ఇషా చావ్లా కూడా తన ఎంట్రీపై క్లారిటీ ఇచ్చింది. ఇన్‌స్టాలో ఓ అభిమాని మీరు బిగ్‌బాస్‌లోకి వెళ్తున్నారా అని ఈ అమ్మడుని అడగ్గా, అందుకు ఇషా తాను బిగ్‌బాస్ షోకి వెళ్లడం లేదని చెప్పుకొచ్చింది. దీంతో అన్ అఫిసియల్ జాబితాలో నుంచి ఇషా చావ్లా అవుట్ అయినట్టు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :