ఆలీ వీడియో ప్లే చేయగానే కన్నీరు పెట్టిన హీరోయిన్..!

Published on Jul 1, 2021 1:48 am IST


తెలుగు బుల్లి తెరపై ప్రస్తుతం ఎన్నో కామెడీ ప్రోగ్రాంస్, రియాలిటీ ప్రోగ్రాంస్ మనల్ని ఎంతగానో అలరిస్తున్నాయి. అయితే ఈటీవీలో ప్రసారమయ్యే అలీతో సరదాగా ప్రోగ్రాం కూడా మంచి రేటింగ్‌ను సంపాదించుకోవడంతో పాటు కావలసినంత వినోదాన్ని మనకు అందిస్తూ వస్తుంది. ఈ షోలో ముఖ్యంగా చెప్పుకునే విషయం ఏమిటంటే ఆలీ వ్యాఖ్యాతగా వ్యవహరించడం. ఆలీ వేసే ప్రశ్నలు, సెలబ్రేటీలు ఇచ్చే గమ్మతైన సమాధానాలు వీక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంటాయి.

అయితే ఈ కార్యక్రమానికి ఎప్పటిలాగానే వచ్చే వారానికి ఓ సెలబ్రెటీ రాబోతుంది. ఆమె ఎవరో కాదు ‘ప్రేమికులు’ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన కామ్నా జఠ్మలానీ. అయితే మొదటి సినిమా ఆమెకు పెద్దగా పేరు తెచ్చిపెట్టకపోయినా ఆ తర్వాత చేసిన ‘రణం’ సినిమా సక్సెస్ కావడం ఈ అమ్మడుకి మంచి గుర్తింపు తెచ్చింది. అయితే హీరోయిన్‌గా కెరిర్‌ను నిలబెట్టుకుంటున్న సమయంలో బెంగళూరుకు చెందిన ఓ వ్యాపారవేత్తను వివాహం చేసుకున్న కామ్నా ఆ తర్వాత సినిమాలకు దూరమయ్యారు. అయితే ఆమె నటనకు దూరమై ఆరేళ్లు గడిచినా, ప్రస్తుతం ఆమెకు ఇద్దరు పిల్లలున్నా కూడా ఆమె అందం ఎక్కడా తీసిపోలేదు. తాజాగా అలీతో సరదాగా షోకు వచ్చిన కామ్నా తన కెరీర్‌, పర్సనల్‌ లైఫ్‌ గురించి ఎన్నో విషయాలను పంచుకున్నారు.

ఇందులో భాగంగానే అలీ మీ గురుంచి ఎవరో ఏదో మాట్లాడుతారంటూ ఒక వీడియోను ప్లే చేస్తాడు. అయితే అది చూసిన కామ్నా ఒక్కసారిగా భావోద్వాగానికి లోనై ఒకింత కంటతడి పెట్టుకుంది. అయితే అసలు ఆ వీడియోలో ఎవరున్నారు, కామ్నా గురుంచి ఏం మాట్లాడారు, కామ్నా ఎందుకు కంటతడి పెట్టుకుంది అనేది తెలియాలంటే మాత్రం వచ్చే సోమవారం రాత్రి 9:30 గంటలకు ఈటీవీలో ప్రసారమయ్యే అలీతో సరదాగాను చూడాల్సిందే.

సంబంధిత సమాచారం :