కీర్తి సురేష్ సినిమాకి ఇంట్రస్టింగ్ టైటిల్  ! 

కీర్తి సురేష్ సినిమాకి ఇంట్రస్టింగ్ టైటిల్  ! 

Published on May 16, 2019 4:05 PM IST

నరేంద్ర అనే నూతన దర్శకుడి దర్శకత్వంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాకు ‘సఖి’ అనే టైటిల్ ను చిత్రబృందం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అయితే టైటిల్ కి సంబంధించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతానికైతే ఐరోపాలో కీలక సన్నివేశాలను షూట్ చేస్తోంది చిత్రయూనిట్.

కాగా మహిళల పై ఒక్కో స్టేజిలో ఒక్కో రాకంగా దాడుల జరుగుతాయి. ఆ దాడులని ఈ చిత్రంలో విశ్లేషాత్మకంగా చూపించనున్నారని సమాచారం. మహానటి సినిమాలో సావిత్రి పాత్రలో పరకాయ ప్రవేశం చేసి తెలుగు ప్రేక్షకుల మనసులను గెలుచుకున్న కీర్తి సురేష్.. మరి ఈ లేడీ ఓరియెంటెడ్ సినిమాతో కూడా ప్రేక్షకుల ముంమనసును గెలుసుకుంటుందేమో చూడాలి.

ఈస్ట్ కోస్ట్ బ్యానర్ పై మహేష్ కోనేరు నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాలో నరేష్, నదియా, రాజేంద్రప్రసాద్, కమల్ కమారాజు, భానుశ్రీ మెహ్రా ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు