నేను తల్లి కాబోతున్నానా… హీరోయిన్ రియాక్షన్ !

Published on Feb 27, 2019 8:35 pm IST

అందం, అభినయం ఉన్నప్పటికీ హీరోయిన్ గా పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయింది రాయ్ లక్ష్మీ. అయితే మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెం 150 చిత్రంలో రత్తాలు పాటలో, అలాగే పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ లో ఓ ప్రత్యేక పాటలో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగానే దగ్గరైంది ఈ కన్నడ బ్యూటీ.

కాగా తాజాగా ఇప్పుడు రాయ్ లక్ష్మీ ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’ అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులను మళ్ళీ పలకరించనుంది. అయితే తాజాగా రాయ్ లక్ష్మీ తల్లి కాబోతోంది అంటూ సోషల్ మీడియాలో గాసిప్ రాయుళ్లు ఓ రూమర్ ను పుట్టించారు.

దాంతో రాయ్ లక్ష్మీ ఆ రూమర్ పై తీవ్రంగానే స్పందించింది. ఎటువంటి ఆధారాలు లేకుండా ఇటువంటి అబద్దపు వార్తల్ని ఎలా పుట్టిస్తారు ? తప్పును కూడా చాలా ధైర్యంగా చేస్తున్నారని తెగ సీరియస్ అయింది. ఇలాంటి వార్త రాసే వ్యక్తికి, ఖచ్చితంగా నేనంటే ఇష్టం ఉండి ఉండదని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.

సంబంధిత సమాచారం :