విజయ్ దేవరకొండ సినిమాలో హీరోయిన్ ఖరారు అయ్యిందా ?
Published on Mar 3, 2018 9:53 am IST

విజయ్ దేవరకొండ ప్రస్తుతం టాక్సివాల సినిమాలో నటిస్తున్నాడు. రాహుల్ సంకృతియన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ఈ ఏడాది వేసవిలో విడుదల కానుంది. ఈ సినిమా తరువాత పరుసురం బుజ్జి సినిమా రానుంది. తాజా సమాచారం మేరకు విజయ్ నటించబోయే తమిళ్ సినిమా ఈ నెలలో ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఆనంద్ శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు.

ఈ సినిమాలో మెహరిన్ హీరోయిన్ గా నటించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. విజయ్ పక్కన మెహరిన్ బాగుంటుందని భావించిన దర్శకుడు ఆమెను సంప్రదించినట్లు తెలుస్తోంది. త్వరలో ఈ హీరోయిన్ పేరు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్ తరువాత యస్ రంగినేని నిర్మించబోతున్న సినిమాలో నటిస్తాడు విజయ్.ఈ మూవీ మే నుండి ప్రారంభం కానుంది.

 
Like us on Facebook