రొమాంటిక్‌ మూడ్ లోకి.. యాక్షన్ హీరో !

Published on May 6, 2019 9:39 am IST

యాక్షన్ హీరో గోపీచంద్‌ ప్రస్తుతం రొమాంటిక్‌ మూడ్‌ లోకి మారిపోయారు. గోపీచంద్ నిర్మాత అనిల్ సుంకర నిర్మాణంలో తమిళ్ డైరెక్టర్ తిరు దర్శకత్వంలో కొత్త చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవలే ఇండో -పాక్ బోర్డర్ పరిసర ప్రాంతాల్లో భారీ యాక్షన్ షెడ్యూల్ ను చేసిన గోపీచంద్.. ఇప్పుడు డ్యూయెట్స్‌ లో స్టెప్స్ వెయ్యడానికి రెడీ అయ్యారు.

ఈ సినిమాలో గోపీచంద్‌ సరసన మెహరీన్‌ హీరోయిన్‌ గా నటిస్తోంది. గతంలో వీరి కాంబినేషన్ లో ‘పంతం’ సినిమా వచ్చింది. అలాగే ఈ చిత్రంలో బాలీవుడ్‌ హీరోయిన్‌ జరీనా ఖాన్‌ కూడా కీలక పాత్రలో నటిస్తోందట. కాగా తాజాగా చిత్రబృందం హీరో హీరోయిన్ల మీద పాటలను చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు. యాక్షన్‌ థ్రిల్లర్‌ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో గోపీచంద్‌ గూఢచారి పాత్రలో నటిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం విడుదల చెయ్యాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తోన్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాకి సాంకేతిక నిపుణులు : కథ, స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం : తిరు, నిర్మాత: రామబ్రహ్మం సుంకర, సంగీతం: విశాల్ చంద్రశేఖర్, సినిమాటోగ్రఫీ: వెట్రి పళనిస్వామి, రచయిత: అబ్బూరి రవి.

సంబంధిత సమాచారం :

More