స్కూల్ ని దతత్త తీసుకున్న ‘పవన్ కళ్యాణ్’ హీరోయిన్ !

Published on Oct 17, 2018 12:06 pm IST

పవన్ కళ్యాణ్ సరసన ‘అత్తారింటికి దారేది’ చిత్రంలో బాపు బొమ్మగా మెరిసిన ప్రణీత.. తన రూపమే కాదు, తన మనసు కూడా ఎంతో అందమైనది నిరూపించుకున్నారు. కనీస సౌకర్యాలు కూడా లేని ఓ ప్రభుత్వ పాఠశాలను ఆమె దత్తత తీసుకుని.. ఆ పాఠశాలలో అందుబాటులో లేని సదుపాయాలను సమకూరుస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. తన తండ్రి పుట్టి పెరిగిన ఆలూరులోని పాఠశాలను అక్కడ పరిస్థితులను చూసిన ప్రణీత, తన సొంతూరికి సేవ చెయ్యాలనే ఉద్దేశ్యంతో.. ఎలాంటి సదుపాయాలు లేని అక్కడి పాఠశాలను దతత్త తీసుకున్నారు.

కాగా ప్రణీత ఇప్పటికే ఆ పాఠశాల కొరకు ఐదు లక్షల రూపాయలతో కనీస సౌకర్యాలు కల్పించనున్నారు. ప్రధానంగా అక్కడ మరుగుదొడ్డి నిర్మించడంతో పాటుగా విద్యార్థుల తరగతి గదులకు మరమ్మత్తులు చేయనున్నారు. మొత్తానికి ప్రణీత చేపట్టిన ఈ మంచి కార్యక్రమానికి, నెటిజన్లు ఆమెను అభినందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :