ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో జాయిన్ కానున్న హీరోయిన్లు !

ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో జాయిన్ కానున్న హీరోయిన్లు !

Published on Mar 28, 2019 4:20 PM IST

మచ్ అవైటెడ్ మూవీ ఆర్ఆర్ఆర్ చిత్రం ఇటీవల హైదరాబాద్ లో బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుంది. ఇక ఈ చిత్రం యొక్క తదుపరి షెడ్యూల్ నార్త్ ఇండియాలో జరుగనుంది. ఈ షెడ్యూల్ లో ఎన్టీఆర్ , చరణ్ తోపాటు హీరోయిన్లు అలియా భట్ , డైసీ ఎడ్గార్ జోన్స్ లు కూడా జాయిన్ కానున్నారు.

స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత చరిత్రలను బేస్ చేసుకొని అగ్ర దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో చరణ్ కు జోడిగా అలియా భట్, ఎన్టీఆర్ కు జోడీగా డైసీ నటించనున్నారు.

ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ , సముద్రఖని నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో దానయ్య డివివి నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జులై 30 న విడుదలకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు