‘ఏయ్ జూనియర్’ ఫస్ట్ లుక్ !

Published on Jul 10, 2019 4:30 pm IST

తెలంగాణా స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా ” ఏయ్ జూనియర్ ” చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఆవిష్కరించడం జరిగింది. ఈ చిత్రాన్ని వ్యాంకిష్ మీడియా సంస్థ నిర్మించగా , షేక్ గౌస్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు రవికుమార్ పొన్నగంటి. తెలంగాణా స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సందేశంతో కూడుకున్న ఈ ప్రేమకథా చిత్రం తప్పక విజయవంతం కావాలని, సమాజానికి ఉపయోగపడే మరెన్నో మంచి చిత్రాలని నిర్మించాలని ఈ చిత్ర దర్శక నిర్మాతలని కోరారు.

చిత్ర దర్శకులు రవికుమార్ పొన్నగంటి మాట్లాడుతూ.. కాలేజ్ బ్యాక్‌ డ్రాప్ లో ఓ చక్కని టీనేజ్ లవ్ స్టోరీగా దీన్ని తెరకెక్కించామని, అసభ్యతకు తావులేకుండా కుటుంబం మొత్తం కలిసి చూసేలా ఈ చిత్రాన్ని నిర్మించామని, ఇందులో పాటలన్నీ యువతకు నచ్చే విధంగా ఉంటాయని ఈ చిత్రానికి పనిచేసిన నటీనటులకి టెక్నీషియన్స్ కి అలాగే నాకు దర్శకునిగా అవకాశమిచ్చిన షేక్ గౌస్ గారికి ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత సమాచారం :

X
More