సూపర్ క్యాచీగా “మహాసముద్రం” ‘హే రంభ’ సాంగ్.!

Published on Aug 6, 2021 10:13 am IST

మన టాలీవుడ్ నుంచి వస్తున్న పలు ఇంట్రెస్టింగ్ మల్టీ స్టారర్ చిత్రాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ మరియు సిద్ధార్థ్ ల కలయికలో “ఆర్ ఎక్స్ 100” దర్శకుడు జయ్ భూపతి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ చిత్రం “మహా సముద్రం” కూడా ఒకటి. కేవలం వీరు మాత్రమే కాకుండా మరింత మంది స్టార్ నటులకు బలమైన రోల్స్ ఇచ్చి ఆసక్తి రేపుతున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ “హే రంభ” అనే సాంగ్ ను ఈరోజు లాంచ్ చెయ్యనున్నట్టుగా ముందు నుంచీ తెలిపారు.

మరి ఆ నాటి స్టార్ హీరోయిన్ కం ఐటెం బాంబ్ రంభకు ట్రిబ్యూట్ గా ఇచ్చిన సాంగ్ వింటుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా మరియు మంచి క్యాచీగా ఉందని చెప్పాలి. చైతన్ భరద్వాజ్ ఫ్రెష్ మ్యూజిక్ భాస్కర భట్ల సాహిత్యం ఈ సాంగ్ కి చాలా ఇంపుగా సెట్టయ్యాయి. అంతే కాకుండా ఈ సాంగ్ లో చూపించిన శర్వానంద్ పై విజువల్స్ కూడా బాగున్నాయి. ఇంతకు ముందు ఎప్పుడు చూడని విధంగా శర్వా కనిపిస్తున్నాడు.

అలాగే మధ్యలో నటుడు జగపతిబాబుతో కూడా లిరిక్స్ పాడించడం ఈ సాంగ్ లో గమనార్హం.. మొత్తానికి మాత్రం ఈ సాంగ్ ఈ చిత్రంలో మంచి ఎసెట్ గా నిలుస్తుంది అని అనిపిస్తుంది. మరి ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రంలో అను ఇమ్మానుయేల్ మరియు అదితిరావు హైదరీలు హీరోయిన్స్ గా నటించగా అనిల్ సుకంర నిర్మాణం వహించారు.

లిరికల్ సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :