పోస్ట్ ప్రొడక్షన్ లో మ్యూజికల్ హారర్ !

Published on Jul 25, 2019 12:00 am IST

మిస్టర్ 7, చిత్రం చెప్పిన కథ, మామ ఓ చందమామ చిత్రాలకు సంగీత దర్శకుడిగా పని చేసి గుర్తింపు తెచ్చుకున్నారు మున్నా కాశీ. ఆయన హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం “హేజా”. (ఎ మ్యూజికల్ హారర్). వి ఎన్ వి క్రియేషన్స్ పతాకం పై కెవిఎస్ఎన్ మూర్తి ఈ చిత్రాన్ని నిర్మించారు. ముమైత్ ఖాన్, నూతన నాయుడు( బిగ్ బాస్ ఫేమ్), ల‌క్ష్మ‌న్(ఆర్.ఎక్స్ 100ఫేమ్) ప్రీతం నిగమ్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. నాని చమిడిశెట్టి సినిమాటోగ్రఫీని అందించారు. మ్యూజికల్ హారర్ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం టీజర్ విడుదలైంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగాజరుగుతున్నాయి.

ఈ సందర్భంగా.. దర్శకుడు, హీరో మున్నా కాశి మాట్లాడుతూ… ఫస్ట్ టైమ్‌ హీరోగా, దర్శకుడిగా మారి చేస్తున్న సినిమా ఇది.. ఒక మ్యూజికల్ హారర్ గా అధ్బుతమైన కథాంశంతో తెరెక్కుతున్న చిత్రం ఇది. ఈ సినిమా విజయంపై కాన్ఫిడెంట్ గా ఉన్నాం” అన్నారు. నిర్మాత కెవిఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ.. ఎంతో క్లారిటీగా ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా సినిమా ఉంటుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి త్వరలో అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి విలేకరుల సమావేశం నిర్వహించి విడుదల తేదీని ప్రకటిస్తాం” అన్నారు.

సంబంధిత సమాచారం :