మళ్లీ వాయిదా పడిన ప్రభాస్ కేసు !

Published on Jan 3, 2019 10:53 pm IST

శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలో రెబల్ స్టార్ ప్రభాస్ గెస్ట్ హౌస్ ఉన్న స్థలం ప్రభుత్వానికి చెందినదని రెవిన్యూ ఆఫీసర్స్ గెస్ట్ హౌస్ ను ఇప్పటికే సీజ్ చేసిన విషయం తెలిసిందే. దాంతో హైకోర్టులో ప్రభాస్ వర్గం పిటిషన్ దాఖలు చేయగా.. ఆ పిటిషన్ కి సంబంధించి పలు వాయిదాలు అనంతరం మళ్ళీ ఈ రోజు కేసు పై హైకోర్టులో వాదనలు జరిగాయి.

ఈ వాదనలలో ప్రభుత్వం తరపు న్యాయవాది ప్రభాస్ కు అనుకూలంగా ఈ కేసు విషయంలో తీర్పునిస్తే కబ్జాదారులను ప్రోత్సహించడమే అవుతుందని ఆరోపించారు. అయితే ప్రభాస్ తరపు న్యాయవాది గతంలో ఆ స్థలాన్ని ప్రభాస్ తండ్రితో కొన్నారని, ఆ స్థలం ప్రభాస్ చెందడమే న్యాయమని అన్నారు. ఇలా ఇరు వాదనలు విన్న న్యాయస్థానం తీర్పుని రిజర్వ్ చేసింది.

సంబంధిత సమాచారం :