హైలైట్స్..ఏకంగా 4100 గ్రామాల్లో “నారప్ప” ను చూశారట.!

Published on Jul 31, 2021 7:05 pm IST

మన టాలీవుడ్ అందరి ఫేవరెట్ హీరోల్లో స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ఒకరు. మరి వెంకీ మామ హీరోగా ప్రియమణి హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “నారప్ప” ఇటీవల అమెజాన్ ప్రైమ్ లో నేరుగా విడుదల అయ్యి భారీ హిట్ అయ్యింది. తమిళ సూపర్ హిట్ “అసురణ్” కి రీమేక్ గా ఈ చిత్రాన్ని దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించారు. మరి పలు కారణాల చేత ఓటిటిలోనే విడుదల కాబడ్డ ఈ చిత్రం సక్సెస్ మీట్ ని మేకర్స్ నిన్న గ్రాండ్ గా నిర్వహించగా మేకర్స్ ఆ ఫంక్షన్ లో చెప్పిన విషయాలు మంచి హైలైట్స్ చాలానే ఉన్నాయి.

ముందుగా నిర్మాత వెంకీ మామ సోదరుడు దగ్గుబాటి సురేష్ బాబు మాట్లాడుతూ ఈ చిత్రాన్ని చాలా రోజులు కష్టపడి తీశామని అలాగే ఇండియా వైడ్ ప్రైమ్ వీడియో వారికి 4400 గ్రామాల్లో వీక్షకులు ఉండగా అందులో ఏకంగా 4100 గ్రామాల్లో ఈ చిత్రాన్ని వీక్షించారని అలాగే 180 దేశాల్లో ఈ చిత్రం విడుదల అయ్యిందని మంచి ప్రమోషన్స్ ని అమెజాన్ వారు చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానని తెలిపారు. అలాగే ప్రియమణి కూడా ఈ బ్యానర్ లో నటించాలని ఎప్పుడు నుంచో అనుకుంటుండగా ఇప్పుడు అవకాశం దక్కింది అని తెలిపింది.

అలాగే దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కూడా కీలక కామెంట్స్ చేశారు. తమ టీం అంతా కష్టపడి తీసిన చిత్రం మారుమూల గ్రామాలకు చేరుకోవడం సంతోషంగా ఉందని వెంకటేష్ గారి నుంచి చాలా నేర్చుకున్నని థాంక్స్ చెప్పారు. అలాగే ఈ వేడుకకు గెస్ట్ గా వచ్చిన దర్శకుడు అనీల్ రావిపూడి కూడా ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఎఫ్2 టైం లోనే ఈ సినిమా కోసం చెప్పారని అప్పుడే నేను చాలా ఎగ్జైట్ అయ్యానని తెలిపారు. వెంకటేష్ గారు ఎలాంటి రోల్ అయినా సూపర్ గా చెయ్యగలరు అందుకే ఇలాంటి సినిమాలో అయన ఎలా కనిపిస్తారా అని ఎదురు చూశానని తెలిపారు.

ఇంకా ఫైనల్ గా వెంకీ మామ మాట్లాడుతూ నారప్ప సినిమాని ఇంత హిట్ చేసినందుకు ఆడియెన్స్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ‘అసురణ్’ సినిమా ఇచ్చిన ధనుష్ వెట్రిమారన్ లకి మరింత ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తాను ఎన్నో సినిమాలో చేసినా నారప్ప లాంటి ఒక రోల్ చెయ్యడంతో తనకే ఛాలెంజింగ్ గా అనిపించింది అని అది వారు లేకపోతే జరిగి ఉండేది కాదని తెలిపారు. అలాగే ఈ సినిమాలో అనంత్ శ్రీరామ్ సాహిత్యం ఇచ్చిన “రా నరకరా” సాంగ్ లిరిక్స్ విన్నాక ఈ సినిమా ఎప్పుడు మొదలు పెడదామా అనిపించింది అని అంత గొప్పగా రాసారని వెంకీ మామ కొనియాడారు. మొత్తంగా ఈ సినిమాకి ఇంత గొప్ప ఆదరణ ఇచ్చిన తన అభిమానులకు పెద్ద థాంక్స్ చెప్పి మళ్ళీ సంక్రాంతికి తన ‘ఎఫ్ 3’ తో కలుద్దామని కన్ఫర్మ్ చేశారు.

సంబంధిత సమాచారం :