కార్తికేయ కెరియర్ మళ్ళీ మొదటికొచ్చినట్టేనా ?

Published on Jun 12, 2019 12:04 am IST

‘ప్రేమతో మీ కార్తిక్’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు కార్తికేయ. కానీ ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. దాంతో ‘ఆర్ఎక్స్ 100’ లాంటి బోల్డ్ కంటెంట్ ఉన్న కథను చూజ్ చేసుకున్నాడు. ఆయన అనుకున్నట్టే ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాన్ని అందుకుని మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ ఉత్సాహంతోనే ‘హిప్పీ’ అనే సినిమా చేశాడు. ట్రైలర్ ఆకట్టుకోవడంతో మరోసారి కార్తికేయ నుండి ‘ఆర్ఎక్స్ 100’ లాంటి ట్రీట్ ఖాయమనుకున్నారు ఆడియన్స్.

కార్తికేయ సైతం ‘ఆర్ఎక్స్ 100’ను మించి ‘హిప్పీ’ ఉంటుందన్నాడు. కానీ విడుదలయ్యాక రిజల్ట్ వేరేలా ఉంది. సినిమాలో స్ట్రాంగ్ కంటెంట్ కొరవడటంతో ప్రేక్షకులు సునాయాసంగా సినిమాను రిజెక్ట్ చేశారు. బాక్సాఫీస్ వద్ద వసూళ్లను చూస్తే సినిమా డిజాస్టర్ అని తేలింది. దీంతో ‘ఆర్ఎక్స్ 100’ తెచ్చిపెట్టిన క్రేజ్ కాస్త మసకబారింది. ఈ పరాజయం కార్తికేయను మళ్ళీ మొదటికే తీసుకొచ్చింది. ఇకపై ఆయన కెరియర్ నిలదొక్కుకోవాలన్నా, మార్కెట్ క్రియేట్ కావాలన్నా ‘ఆర్ఎక్స్ 100’ స్థాయి విజయం తప్పనిసరి అనే పరిస్థితి తలెత్తింది.

సంబంధిత సమాచారం :

More