న్యాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ ‘హిట్-3’ మే 1న గ్రాండ్ వరల్డ్‌వైడ్ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించగా హిట్ ఫ్రాంచైజీలో మూడో భాగంగా ఈ మూవీ రూపొందింది. ఇక ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఈ మూవీని తీర్చిదిద్దారు మేకర్స్.
ఈ సినిమాను ఓవర్సీస్‌లోనూ భారీ అంచనాల మధ్య రిలీజ్ చేస్తున్నారు. యూఎస్‌లో ‘హిట్-3’ ప్రీమియర్స్‌కు అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ షురూ అయ్యాయి. ఈ క్రమంలో సినిమా రిలీజ్‌కు వారం ముందుగానే ఈ చిత్రం అక్కడ రికార్డులు క్రియేట్ చేయడం స్టార్ట్ చేసింది. ‘హిట్-3’ మూవీ యూఎస్ ప్రీమియర్స్ ప్రీ-సేల్స్‌లో ఏకంగా 100K డాలర్ల వసూళ్లు రాబట్టినట్లు చిత్ర వర్గాలు తెలిపాయి.
ఇక ఈ సినిమా అక్కడ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం నాని అమెరికా కూడా వెళ్లనుండటంతో ఓవర్సీస్ మార్కెట్‌లో ‘హిట్-3’ అదిరిపోయే వసూళ్లు రాబట్టడం ఖాయమని సినీ సర్కిల్స్ చెబుతున్నాయి. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు.


