స్టార్ హీరో కోసం.. హిట్ డైరెక్టర్ ?

Published on Aug 6, 2019 1:00 pm IST

దర్శకుడు పరుశురామ్ ‘గీత గోవిందం’తో తన ఖాతాలో భారీ విజయాన్ని నమోదు చేసుకున్నాడు. భారీ వసూళ్ళను సాంధించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది ‘గీత గోవిందం’. దాంతో పరుశురామ్ తరువాత సినిమా పై ప్రేక్షకుల్లో బాగానే ఆసక్తి ఏర్పడింది. కాగా పరుశురామ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుతో తన తరువాత సినిమాని ప్లాన్ చేస్తున్నాడని.. లేదూ మళ్లీ విజయ్ దేవరకొండతోనే సినిమా ప్లాన్ చేస్తున్నాడని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు అయితే వస్తున్నాయి గాని.. ఇంతవరకూ పరుశురామ్ నుండి మాత్రం ఎలాంటి అప్ డేట్ లేదు.

అయితే పరుశు రామ్ ఇప్పటికే మహేశ్ కి ఒక లైన్ చెప్పినట్లు.. లైన్ విన్న మహేశ్ ఫుల్ స్క్రిప్ట్ తో రమ్మని చెప్పినట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం పరుశురామ్ మహేష్ కోసం స్క్రిప్ట్ పనులు పూర్తి చేసినా.. ప్రస్తుతం తన తరువాత సినిమా మహేష్ తో చెయ్యట్లేదని తెలుస్తోంది. మళ్లీ విజయ్ దేవరకొండతోనే చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నా అది కూడా నిజం కాదట. ప్రస్తుతం పరుశురామ్ పెద్ద హీరోలకు కథ చెప్పే పనిలో ఉన్నాడని.. తన కథకు ఏ హీరో ఓకే అంటే.. ఆ హీరోతోనే తన తరువాత సినిమా ఉంటుందట. మరి పరుశురామ్ కథకు ఏ స్టార్ హీరో ఒకే చెప్తాడో చూడాలి.

సంబంధిత సమాచారం :