ర‌జ‌నీకాంత్‌తో నటిస్తానంటున్న హాలీవుడ్ నటుడు

Published on Jun 14, 2019 1:31 pm IST

రజనీకాంత్ ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో ‘దర్బార్’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న రజనీ అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. అందుకే ఈ సినిమాలో నటించాలని ఆశపడుతున్నారు హాలీవుడ్ నటుడు బిల్ డ్యూక్. ‘ఎక్స్ మెన్, కమాండో, ప్రిడేటర్’ లాంటి హిట్ సినిమాల్లో నటించి మెప్పించిన బిల్ డ్యూక్ ఈమధ్య ఇండియన్ సినిమాలు మరీ ముఖ్యంగా దక్షిణాది మీద ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.

గతంలో మహేష్ బాబుతో కలిసి నటించాలనుందని చెప్పిన బిల్ డ్యూక్ తాజాగా మురుగదాస్ డైరెక్షన్లో రూపొందే ‘దర్బార్’ సినిమాలో రజనీకి అమెరికన్ కజిన్ పాత్రలోనో లేకపోతే నయనతారకు అంకుల్‌గానో నటించాలని ఉందని ట్వీట్ చేశారు. దీంతో మురుగదాస్ సైతం ఆశ్చర్యపోతూ సర్.. నిజంగా మీరేనా ఈమాట అంటున్నది అంటూ ట్వీట్ చేసి సమాధానమిచ్చారు. డ్యూక్ ఆసక్తి చూస్తుంటే త్వరలోనే ఆయన దక్షిణాది సినిమాల్లో కనిపించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

సంబంధిత సమాచారం :

More