ప్రభాస్ పాన్ వరల్డ్ సినిమాకి అత్యంత ఖరీదైన లెన్స్ షాట్స్.?

Published on Jul 3, 2021 3:01 pm IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ రేంజ్ మారే సరికి తన సినిమాలకు ఒక్కో సినిమాకు ఒక్కో భారీ హంగు మేకర్స్ అద్దుతున్నారు. అలా ఇప్పటికే “రాధే శ్యామ్” మరియు “ఆదిపురుష్” చిత్రాలకు నెవర్ బిఫోర్ టెక్నాలజీ ఉపయోగించి సినిమాలు తెరకెక్కిస్తున్నారు. మరి వీటిని పక్కన పెడితే ప్రభాస్ నుంచి వాటికి మించిన ప్రాజెక్ట్, తన కెరీర్ లో మొట్టమొదటి పాన్ వరల్డ్ చిత్రం దర్శకుడు నాగ్ అశ్విన్ తో చేస్తున్నాడు.

మరి ఈ సినిమా భారీ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ థ్రిల్లర్ గా తెరకెక్కనుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ సమాచారం వినిపిస్తుంది. ఈ సినిమా కోసం నాగ్ అశ్విన్ ప్రపంచంలోని పలు భారీ చిత్రాలను తెరకెక్కించిన అత్యంత ఖరీదైన కెమెరా లెన్స్ ఏరీ అలెక్సా 65 తో షూట్ చెయ్యనున్నారట.

సుమారు లక్ష 50 వేల డాలర్ల కన్నా ఎక్కువ ఉండే ఈ కెమెరా భారీ మోషన్ పిక్చర్ సినిమాస్ “అవెంజర్స్”, “పాసెంజర్స్”, “డాక్టర్ స్ట్రేంజ్”, లేటెస్ట్ “గాడ్జిల్లా వర్సెస్ కాంగ్” లాంటి ఎన్నో సినిమాలు తీసారట. అలాంటప్పుడు ఈ సినిమా ఎలా ఉంటుందో అసలు నాగ్ అశ్విన్ విజువలైజేషన్ ఏ స్థాయిలో ఉంటుందో ఊహించొచ్చు..

సంబంధిత సమాచారం :