విజయ్ దేవరకొండ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్!

విజయ్ దేవరకొండ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్!

Published on Apr 18, 2026 4:00 PM IST

Vijay-Devarakonda

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా అనౌన్స్ అయ్యిన తాజా సినిమా కోసం ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో డిస్కషన్ పెరిగింది. హాయ్ నాన్న అనే క్లాస్ సినిమాతో సత్తా చాటిన దర్శకుడు శౌర్యువ్ తో అనౌన్స్ చేసిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఇప్పుడు బయటకి వస్తున్నాయి. దీనితో ఈ సినిమా టెక్నికల్ టీంలో కొన్ని కీలక పేర్లు వినిపిస్తున్నాయి.

ఈ చిత్రానికి వి ఎఫ్ ఎక్స్ పనులని హాలీవుడ్ సినిమాలు స్పైడర్ మ్యాన్ 2, గాడ్ ఆఫ్ ఈజిప్ట్, బ్యాట్ మ్యాన్ లాంటి సినిమాలకి వర్క్ చేసిన ఎరిక్ డ్రస్ట్ పని చేస్తుండగా కెమెరా వర్క్ అయితే ఫాల్ అవుట్, హౌస్ ఆఫ్ డ్రాగన్ వంటి సాలిడ్ ప్రాజెక్ట్ లకి పని చేసిన అలెజాండ్రో మార్టినిస్ లని లాక్ చేయడం విశేషం. దీనితో విజయ్ దేవరకొండ, శౌర్యువ్ ల ప్రాజెక్ట్ ని ఏ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు