‘పుష్ప’ కోసం మరో ఐటమ్ బాంబ్ ?

Published on Jul 24, 2021 11:11 pm IST

అల్లు అర్జున్ – సుకుమార్ -దేవి కలయికలో సినిమా వస్తోందంటేనే.. ఆడియన్స్ లో అంచనాలు రెట్టింపు ఆవుతాయి. ముఖ్యంగా వీరి కాంబినేష‌న్‌ లో వచ్చే ఐటమ్ సాంగ్స్ ఏ రేంజ్‌ లో ఉంటాయో చెప్ప‌న‌క్క‌ర్లేదు. పుష్పలో కూడా ఒక అదిరిపోయే ఐటమ్ సాంగ్ ని కంపోజ్ చేశాడు దేవి. అయితే, ఈ సాంగ్ కు ఇద్దరు భామలు కావాలట,

ఇప్పటికే ఒక భామగా ఊర్వశి రౌటేలాను ఫైనల్ చేశారు. కాగా మరో భామగా సన్నీ లియోన్‌ను సంప్రదించారని.. ఈ సాంగ్ లో నటించడానికి ఆమె 70 లక్షల మొత్తాన్ని డిమాండ్ చేసిందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్త పై ఇంకా ఎలాంటి అధికారిక అప్ డేట్ అయితే లేదు.

ఇక ‘పుష్ప’ సినిమాతో బన్నీ – సుకుమార్ మరో భారీ హిట్ కొడతారా లేదా అనేది చూడాలి. అయితే ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. రీసెంట్ గా ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ చేసినా కొన్ని కారణాల వల్ల ప్రస్తుతానికి బ్రేక్ ఇచ్చారు.

సంబంధిత సమాచారం :