“సైరా” విషయంలో వైరల్ అవుతున్న పుకారుని నమ్మొద్దు!

Published on Aug 22, 2019 2:00 am IST

నిన్ననే విడుదలైన “సైరా నరసింహా రెడ్డి” టీజర్ మెగాభిమానులకు పూనకాలు తెప్పించగా ఇతర అభిమానుల హీరోల చేత మెగాస్టార్ ఆల్వేస్ మెగాస్టార్ అనిపించేలా చేసింది.చరిత్ర పుటాల్లో నుంచి కనుమరుగయిపోయిన తెలుగు గడ్డకు చెందిన మొట్టమొదటి స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్రపై తెరకెక్కిన ఈ చిత్రం నిన్న విడుదల చేసిన ఒక్క టీజర్ తో అంతకు ముందున్న అంచనాలను మించిన అంచనాలకు చేరిపోయింది.

దీనితో తమ అభిమాన హీరో చిరును వెండితెరపై చూసేందుకు మెగాభిమానులు సహా ఇండస్ట్రీలో ఉన్న చిరు అభిమానులు కూడా ఉరకలేస్తున్నారు.ఈ టీజర్ లాంచ్ కు సంబంధించిన ప్రోగ్రామ్ ముగిసిన తర్వాత డార్లింగ్ హీరో ప్రభాస్ మరియు మెగాస్టార్ చిరు సహా రామ్ చరణ్ ఒకే ఫ్రేమ్ ఓ కనిపించి అభిమానుల కళ్ళలో మరింత ఆనందాన్ని నింపారు.ఇక అంతే కొంత మంది మొదలు పెట్టారు అసలు వార్త.

“సైరా” ప్రీ రిలీజ్ వేడుకకు చిరు తమ్ముడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరియు ప్రభాస్ లు హాజరు కానున్నారని సోషల్ మీడియాలో కొంత మంది వదిలారు.కానీ ఈ వార్తల్లో ఎలాంటి నిజమూ లేదని ఖండిస్తూ చిరు అభిమానులు ఇలాంటి వార్తలను ప్రచారం చేస్తున్న వారికి గట్టి వార్నింగ్ ఇస్తున్నారు.బిగ్ బి,కిచ్చ సుదీప్,విజయ్ సేతుపతి,నయనతార మరియు తమన్నా లాంటి అగ్ర తారాగణం ఉన్న ఈ చిత్రం మొత్తం ఐదు భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా విడుదలకు సిద్ధంగా ఉంది.

సంబంధిత సమాచారం :