వరుసగా మరో 200కోట్ల కలెక్షన్స్ రాబట్టిన స్టార్ హీరో

Published on Nov 10, 2019 11:17 pm IST

బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ మూవీ మిషన్ అని చెప్పొచ్చు. ఈ స్టార్ హీరో ఏడాదికి కనీసం రెండు నుండి మూడు చిత్రాలు విడుదల చేస్తారు. ఈఏడాది ఆయన కేసరి, మిషన్ మంగళ్ మరియు హౌస్ ఫుల్ 4 చిత్రాలను విడుదల చేశారు. కాగా గతం నెల 25న విడుదలైన హౌస్ ఫుల్ 4 మూవీ రికార్డు కలెక్షన్స్ రాబడుతుంది. నిన్నటి వరకు అందిన సమాచారం ప్రకారం హౌస్ ఫుల్ 4 మూవీ 194.48కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. నిన్న శనివారం కూడా ఈమూవీ 2.75 కోట్లు వసూళ్లు దక్కించుకుంది. నెగెటివ్ రివ్యూలతో మొదలైన ఈ చిత్రం ఈ స్థాయి వసూళ్లను సాధించడం విశేషం.

దీనితో హౌస్ ఫుల్ 4 మూవీ 200కోట్ల వసూళ్లకు చేరువైంది. అక్షయ్ గత చిత్రం మిషన్ మంగళ్ కూడా 200కోట్లకు పైగా వసూళ్లు సాధించడం విశేషం. అక్షయ్ తో పాటుగా బాబీ డియోల్, రితేష్ దేశ్ ముఖ్, కృతి సనన్, పూజా హెగ్డే, కృతి కర్బంద నటించారు. ఫర్హాద్ సాంజి ఈ కామెడీ ఎంటర్టైనర్ కి దర్శకత్వం వహించారు.

సంబంధిత సమాచారం :

More