‘సైరా’ క్లైమాక్స్ పరిస్థితి ఏమిటి ?

‘సైరా’ క్లైమాక్స్ పరిస్థితి ఏమిటి ?

Published on Sep 30, 2019 7:36 PM IST

syeraa6

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదల కానున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాలో క్లైమాక్స్ ఎలా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే నరసింహారెడ్డి జీవితం ఆధారంగా క్లైమాక్స్ ను తీస్తే.. సాడ్ ఎండింగ్ తో సినిమాని ముగించాల్సి వస్తోంది. అప్పుడు అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా నిరాశ చెందుతారు. అందుకే నరసింహ రెడ్డి చావుతో కాకుండా నరసింహ రెడ్డి స్ఫూర్తితో … మళ్లీ ఎవరెవరు తిరుగుబాటు చేశారనే అంశాల ఆధారంగా క్లైమాక్స్ ఉంటే బాగుటుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరి క్లైమాక్స్ ఎలా ఉండబోతుందో చూడాలి.

కాగా ప్రస్తుతం రిలీజ్ అవుతోన్న అన్ని భాషల్లో సైరా ప్రమోషన్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక ఈ సినిమాలో అమితాబ్, సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, అనుష్క వంటి స్టార్ లు నటిస్తుండంతో సైరా కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా.. హిందీ, కన్నడ మరియు తమిళ ప్రేక్షకులు కూడా సినిమా పై ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు