ఈ దశాబ్దపు ఆసియా అందగాడు అతడే..!

Published on Dec 6, 2019 2:04 am IST

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ మరో అరుదైన గౌరవం అందుకున్నారు. ఈ దశాబ్దానికి గాను ఆసియా మొత్తంలో అందమైన హీరోగా గుర్తింపు పొందారు. వరల్డ్ ఫేమస్ మ్యాగజైన్ బ్రిటన్స్ వీక్లీ ప్రకారం ఈ ఏడాదికి గాను అలాగే గత పదేళ్ల కాలానికి సెక్సియస్ట్ ఏసియన్ మేల్ గా గుర్తింపు పొందారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ మరియు సామజిక మాధ్యమాలలో నెటిజెన్స్ అభిప్రాయాలు మరియు ఓటింగ్ ఆధారంగా పోల్ నిర్వహించి ఈ అవార్డు కి ఎంపిక చేశారు.

కొన్నాళ్లుగా సరైన హిట్ లేక ఇబ్బందిపడుతున్న హృతిక్ కి ఈ ఏడాది బాగా కలిసొచ్చింది. అయన నటించిన సూపర్ 30 బయోపిక్ హిట్ మూవీగా నిలువగా.., టైగర్ ష్రాఫ్ తో కలిసి చేసిన వార్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. యష్ రాజ్ సమర్పణలో సిద్దార్ధ్ ఆనంద్ తెరకెక్కించిన ఈ చిత్రం 300కోట్లకు పైగా వసూళ్లతో బాలీవుడ్ 2019 హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.

సంబంధిత సమాచారం :

X
More