ఓటిటిలో అన్ని రికార్డ్స్ బ్రేక్ చేసిన “ఫైటర్”!?

ఓటిటిలో అన్ని రికార్డ్స్ బ్రేక్ చేసిన “ఫైటర్”!?

Published on Apr 3, 2024 2:34 PM IST

రీసెంట్ గా బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన లేటెస్ట్ హిట్ చిత్రాల్లో బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ (Hrithik Roshan) హీరోగా దీపికా పదుకోణ్ (Deepika Padukone) హీరోయిన్ గా బాలీవుడ్ యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన భారీ యాక్షన్ చిత్రం “ఫైటర్” (Fighter). మరి ఈ చిత్రం హృతిక్ కెరీర్ లో మరో బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలవగా కొన్ని రోజులు కితమే ఓటిటిలో కూడా స్ట్రీమింగ్ కి వచ్చింది.

అయితే ఈ సినిమాని దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ (Fighter in Netflix) వారు సొంతం చేసుకోగా అందులో కేవలం హిందీలో మాత్రమే ఈ చిత్రం వచ్చింది. అయినా కూడా ఇంతకు ముందు ఉన్న బాలీవుడ్ సినిమాల అన్ని రికార్డ్స్ ని బ్రేక్ చేసినట్టుగా తెలుస్తుంది. కేవలం ఈ రెండు వారాల్లోనే ఫైటర్ చిత్రం 12.4 మిలియన్ వ్యూస్ ని అయితే క్రాస్ చేసి ఇంతకు ముందు ఉన్న “అనిమల్”, “జవాన్”, “డంకి” లాంటి బాలీవుడ్ భారీ హిట్స్ ని దాటినట్టు బాలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి.

వీటిలో పలు చిత్రాలు డబ్బింగ్ అయ్యినవి (Animal, Jawan) ప్రస్తుతం ఫైటర్ కన్నా ఎక్కువ దేశాల్లో అందుబాటులో ఉన్నవి కూడా అయినప్పటికీ “ఫైటర్” వాటిని మించి భారీ రెస్పాన్స్ అందుకోవడం కేజ్రీగా మారింది. మొత్తానికి అయితే థియేటర్స్ కంటే కూడా ఓటిటి లోనే ఫైటర్ కి మాసివ్ రెస్పాన్స్ దక్కింది అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు