కొడైకెనాల్ వెళ్ళనున్న నాని ‘ధమాక’

nani
‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’తో కెరీర్లో మరో బిగ్ హిట్ అందుకున్న నాచురల్ స్టార్ నాని. ప్రస్తుతం నాని ప్రేమగాథ సక్సెస్ టూర్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఈ వారంలో సక్సెస్ టూర్ ఫినిష్ చేసుకోనున్న నాని తన తదుపరి సినిమా షూట్ కోసం కొడైకెనాల్ చెక్కేయనున్నాడు. అసలు విషయంలోకి వెళితే.. నాని తదుపరి సినిమా తనకి మొదటి సినిమాతో బ్రేక్ ఇచ్చిన ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఇప్పటికే హైదరాబాద్ లో మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది.

ఆ తర్వాత నాని ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ ప్రమోషన్స్ లో బిజీగా ఉండడం వలన షూట్ కి బ్రేక్ ఇచ్చారు. ఇప్పుడు నాని అన్ని పనులు పూర్తి చేయడంతో సెకండ షెడ్యూల్ ని ఈ వారం చివరి నుంచి కొడైకెనాల్ లో షూట్ చేయనున్నారు. తెలుగులో ఇప్పటివరకూ రానటువంటి ఓ సరికొత్త జానర్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఓ ప్రేమకథకు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, కామెడీని జతకలిపి ఓ సరికొత్త కథగా ఈ సినిమా కథను దర్శకుడు తీర్చిదిద్దారట. నాని సరసన నివేదిత థామస్, సురభి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి ‘ధమాక’ అనే టైటిల్ ని పరిశీలనలో ఉంచారు.

Exit mobile version