“సర్దార్” లో సెట్స్ కు భారీ ఖర్చు.!

Published on May 11, 2021 3:15 pm IST


కోలీవుడ్ టాలెంటెడ్ హీరో కార్తీ హీరోగా రాశీ ఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “సర్దార్”. అక్కడి టాలెంటెడ్ దర్శకుడు పి ఎస్ మిత్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నుంచి ఇటీవల వచ్చిన మోషన్ పోస్టర్ తో మంచి అంచనాలు కూడా రేకెత్తాయి. అయితే ఈ చిత్రం కథానుసారం కార్తీ ఓ ఓల్డ్ గెటప్ లో ఖైదీలా కనిపిస్తున్నాడు. అలాగే మన దేశభక్తి తరహా చిత్రాల్లానే ఇది కూడా కనిపిస్తుంది.

అయితే ఈ చిత్రానికి సంబంధించి గత కొన్ని రోజుల కితమే భారీ జైలు సెట్ వేస్తున్నారని టాక్ బయటకి వచ్చింది. మరి దాని కోసమో కానీ ఇతర సెట్స్ కు కూడా మేకర్స్ ఏకంగా రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారట. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దృష్టిలో మేకర్స్ సెట్స్ లోనే చాలా మేర షూటింగ్ చేయాలనీ భావిస్తున్నారట. ఇక ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తుండగా ప్రిన్స్ మూవీస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :