“పుష్ప” అవైటెడ్ ఫస్ట్ సింగిల్ కి అంత ఖర్చు చేసారా.?

Published on Aug 6, 2021 11:43 am IST


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని ఇండియన్ వైడ్ గా కూడా ఐకాన్ స్టార్ గా మలుపు తిప్పనున్న తాజా చిత్రం “పుష్ప”. దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియన్ లెవెల్లో సెన్సేషన్ నమోదు చేసేందుకు సన్నద్ధం అవుతుంది. అయితే ఇదిలా ఉండగా మొత్తం రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్న ఈ చిత్రంలో మొదటి భాగం “పుష్ప ది రైజ్” నుంచి మోస్ట్ అవైటెడ్ ఫస్ట్ సింగిల్ పై క్రేజీ అప్డేట్స్ మేకర్స్ ఒక్కొక్క రోజు అప్డేట్స్ ఇస్తూ వస్తున్నారు.

మొత్తం 5 భాషల్లో కూడా మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ సాంగ్ పై ఓ ఆసక్తికర బజ్ వినిపిస్తుంది. మరి దాని ప్రకారం ఈ ఒక్క సాంగ్ కోసమే విజువల్ గా భారీగా ఖర్చు చేసినట్టు తెలుస్తుంది. మరి దాని ప్రకారం ఈ సాంగ్ కి 2 కోట్లకు పైగా ఖర్చు చేశారట, అంతే కాకుండా మ్యూజికల్ గా దేవి అవుట్ స్టాండింగ్ అవుట్ పుట్ ఇవ్వడమే కాకుండా విజువల్ గా కూడా ఈ సాంగ్ అదరగొట్టనున్నట్టు తెలుస్తుంది. మరి ఈ చిత్రంలో బన్నీ సరసన రష్మికా మందన్నా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :