‘కంచె’.. గత కొద్దిరోజులుగా తెలుగులో అంతటా క్రేజీగా మారిపోయిన సినిమా. మెగా ఫ్యామిలీ నుంచి రీసెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్ రెండో సినిమాగా రూపొందిన కంచెపై ఇప్పటికే సినీ అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి కనిపిస్తోంది. రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యానికి, ఒక ప్రేమకథకు ముడిపెట్టి విలక్షణ దర్శకుడు క్రిష్ రూపొందించిన ఈ సినిమా ద్వారా తెలుగు సినీ ప్రేక్షకులు ఒక సరికొత్త అనుభూతికి లోనవుతారని సినిమా యూనిట్ చెబుతూ వస్తోంది. దీపావళి కానుకగా నవంబర్ నెలలో విడుదల కానున్న ఈ సినిమాపై తెలుగుతో పాటు హిందీ, తమిళంలోనూ ఆసక్తి కనిపిస్తూ ఉండడం విశేషం.
ఈ నేపథ్యంలోనే ఈ సినిమాను తమిళం, హిందీలలో డబ్ చేసి విడుదల చేసేందుకు పలు క్రేజీ ఆఫర్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. పలు పెద్ద సంస్థలు ఈ విషయమై కంచె యూనిట్‌తో చర్చలు జరుపుతున్నాయి. ఇక బాహుబలి, శ్రీమంతుడు సినిమాలతో తెలుగు సినిమాకు ఇతర భాషల్లోనూ మంచి క్రేజ్ కనిపించిన నేపథ్యంలో యూనివర్సల్ కాన్సెప్ట్‌తో వస్తోన్న కంచెను పెద్ద ఎత్తున తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్‌కు ప్లాన్ చేస్త్రున్నారు. పోస్టర్స్, ట్రైలర్‌తో కట్టిపడేసిన ఈ సినిమా ప్రస్తుతం సెన్సార్‌తో సహా అన్ని ఇతర కార్యక్రమాలనూ పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్ 6న విడుదల కానుంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా చిరంతన్ భట్ సంగీతం సమకూర్చారు.


