లయన్ యాక్షన్ ఎపిసోడ్స్ కి సూపర్బ్ క్రేజ్

Lion
నట సింహం నందమూరి బాలకృష్ణ మొదటి సాటి ఓ పవర్ఫుల్ సిబిఐ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్న పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘లయన్’. ఈ సినిమాకి మరో స్పెషాలిటీ ఏమిటి అంటే ‘సింహా’, ‘లెజెండ్’ సినిమాల తర్వాత లయన్ లో కూడా బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసాడు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ రోజు సెన్సార్ కార్యక్రమాలను జరుపుకోనుంది. ఈ చిత్ర టీం లయన్ సినిమా రిలీజ్ కోసం ఓ స్పెషల్ ముహూర్తాన్ని కూడా ఫిక్స్ చేసారు. మే 8వ తేదీన ఉదయం 10 గంటల 4 నిమిషాల ఆటతో ఈ సినిమా రిలీజ్ కానుంది.

ఇప్పటి వరకూ రిలీజ్ చేసిన ట్రైలర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది, అంతే కాకుండా ఈ ట్రైలర్స్ లో బాలయ్య పై చూపించిన యాక్షన్ ఎపిసోడ్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. కొన్ని ఫైట్స్ లో బాలయ్య మానరిజమ్స్ కూడా చాలా బాగున్నాయి, దానికి తోడు ఇప్పటికే ఈ సినిమాలోని యాక్షన్ ఎప్సిసోడ్స్ చూసిన వారు రామ్ – లక్ష్మణ్ మాస్టర్స్ సూపర్బ్ గా యాక్షన్ ఎపిసోడ్స్ ని డిజైన్ చేసారని అంటున్నారు. దీంతో బాలయ్య చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ పై మరింత్ర క్రేజ్ ఏర్పడింది.

సత్య దేవా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. బాలకృష్ణ సరసన త్రిష, రాధిక ఆప్టే హీరోయిన్స్ గా కనిపించనున్నారు. మణిశర్మ మ్యూజిక్ అందించిన ఈ సినిమాకి రుద్రపాటి రమణారావు నిర్మాత.

Exit mobile version