‘భరత్ అనే నేను’ ఆడియో పాసులకు భారీ డిమాండ్ !

మహేష్ బాబు యొక్క ‘భరత్ అనే నేను’ చిత్ర ఆడియో వేడుక ఈరోజు సాయంత్రం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఘనంగా జరగనుంది. ఇప్పటికే సభా స్థలిలో భారీ ఏర్పాట్లను చేశారు నిర్వాహకులు.
వేడుకకు జూ.ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా హాజరుకానుండటంతో ఆడియో వేడుక పాసులకు డిమాండ్ రెట్టింపైంది.

అటు మహేష్ అభిమానులు, ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ పాసుల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే బోలెడంత పాజిటివ్ క్రేజ్ నెలకొంది. డివివి దానయ్య నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 20న రిలీజ్ చేయనున్నారు. ఓవర్సీస్లో అయితే ఈ సినిమాను విడుదలకు ముందురోజే సుమారు 2000 ల ప్రీమియర్ల ద్వారా ప్రదర్శించనున్నారు.