అప్పుడే ‘జైలర్ 2’ కి భారీ డిమాండ్!

అప్పుడే ‘జైలర్ 2’ కి భారీ డిమాండ్!

Published on Jul 7, 2026 10:11 AM IST

Jailer2

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన సెన్సేషనల్ హిట్ చిత్రం జైలర్ కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ మాస్ హిట్ కి సీక్వెల్ గా ఇప్పుడు మేకర్స్ పార్ట్ 2 తీసుకొస్తున్నారు. దీనిపై కూడా భారీ హైప్ నెలకొంది. రీసెంట్ గా వచ్చిన రిలీజ్ డేట్ గ్లింప్స్ తో జైలర్ ఆట షురూ అయ్యింది. గత పార్ట్ తెలుగు సహా తమిళ్, మలయాళ మార్కెట్ లో భారీ వసూళ్లు వచ్చాయి.

ఓ రకంగా మలయాళ మార్కెట్ లో జైలర్ భారీ గ్రాసర్ గా కూడా నిలిచింది. ఇక లేటెస్ట్ గా మోలీవుడ్ లో జైలర్ 2 కి సాలిడ్ బిజినెస్ మొదలైనట్టు తెలుస్తుంది. మోహన్ లాల్ క్రేజ్ కూడా యాడ్ అవడంతో జైలర్ 2 కోసం ఇపుడు టాప్ మోస్ట్ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు ఎగబడుతున్నట్టు తెలుస్తుంది. సో మొత్తానికి జైలర్ బిజినెస్ ఊహించని స్థాయిలో మొదలు కానుంది అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే సన్ పిక్చర్స్ నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు