సుకుమార్ “పుష్ప” పై పెరుగుతున్న అంచనాలు!

Published on Jul 9, 2021 7:36 pm IST

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. ఈ చిత్రంలో అల్లు అర్జున్ పుష్పరాజ్ అనే ఊర మాస్ పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. మునుపెన్నడూ లేని విధంగా సుకుమార్ ఈ చిత్రం కోసం కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే సుకుమార్ తీసిన రంగస్థలం ఇప్పటికే క్లాసిక్ గా నిలిచింది అనడం లో ఎలాంటి సందేహం లేదు. రామ్ చరణ్ అభిమానులకు మళ్ళీ పండుగ తీసుకు వచ్చిన చిత్రం గా రంగస్థలం నిలిచింది. ఈ చిత్రం లో రామ్ చరణ్ మాస్ గెటప్ లో యాక్షన్ సన్నివేశాల్లో పతాక స్థాయిలో నటించారు.

అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పుష్ప చిత్రం లో కూడా అల్లు అర్జున్ ను అంతకుమించి చూపించనున్నారు సుకుమార్. ఈ చిత్రం కోసం సినిమాటోగ్రాఫర్ మిరోస్లా కుబా బ్రోజెక్ ను సుకుమార్ టాలీవుడ్ కి తీసుకు వచ్చారు. అయితే మునుపెన్నడూ లేని ఊర మాస్ సన్నివేశాలు ఈ చిత్రం లో హై క్లాస్ లెవెల్ లోకి దర్శనం ఇవ్వనున్నాయి. ఈ చిత్రం లో కంటెంట్ రంగస్థలం కంటే మెరుగ్గా ఉంటుంది అంటూ ఇప్పటికే చిత్ర వర్గాల్లో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రం లో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా రష్మిక నటిస్తుండగా, దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :