విజయ్ దేవరకొండ “లైగర్” పై పెరుగుతున్న అంచనాలు!

Published on Aug 6, 2022 3:00 am IST

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ లైగర్. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పోర్ట్స్ డ్రామా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం ఆగస్ట్ 25, 2022 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల కాబోతుంది. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి నేషనల్ వైడ్ గా సూపర్ రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఆఫట్ సాంగ్ ప్రోమో కి 10 మిలియన్స్ కి పైగా లైక్స్ రావడం విశేషం.

మరో 20 రోజుల్లో విడుదల థియేటర్ల లో విడుదల కాబోతున్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రం లో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్, సీనియర్ నటి రమ్య కృష్ణ లు ఈ చిత్రం లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :