విజయ్ సినిమా కోసం సుక్కుకు భారీ మొత్తంలో.!

Published on Sep 29, 2020 3:01 pm IST

మన టాలీవుడ్ టాప్ దర్శకుల్లో సుకుమార్ కూడా ఒకరు. సబ్జెక్టు ఎలాంటిది అయినా సరే సుక్కు ఇప్పటివరకు తన మార్క్ ను ఎక్కడా మిస్ చెయ్యకుండా తనదైన ఇంటెలిజెన్స్ ప్రదర్శిస్తూ మోస్ట్ ఫేవరెట్ దర్శకుల్లో ఒకరుగా నిలిచారు. అయితే ఇపుడు సుకుమార్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో “పుష్ప” అనే భారీ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ ప్రాజెక్ట్ అనంతరం టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండతో ఒక ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసేసారు. దీనిని కూడా పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా ప్లాన్ చేస్తున్నారని కూడా కన్ఫర్మ్ చేసేసారు. అయితే ఈ ప్రాజెక్ట్ కు గాను సుకుమార్ భారీ స్థాయి రెమ్యునరేషన్ తీసుకోనున్నట్టుగా తెలుస్తుంది. ఈ చిత్రానికి విజయ్ స్నేహితుడు కేదర్ నిర్మాతగా వహిస్తుండగా సుకుమార్ కు కేవలం అడ్వాన్స్ గా 10 కోట్లు ఇచ్చినట్టు తెలుస్తుంది.ఇపుడు ఈ అంశమే మంచి హాట్ టాపిక్ గా మారయింది. ఇక ఈ చిత్రం వచ్చే 2022లో మొదలు కానుంది.

సంబంధిత సమాచారం :

More