మోస్ట్ వ్యూడ్ టాలీవుడ్ ట్రైలర్ గా మెగాస్టార్ “ఆచార్య”

Published on Apr 13, 2022 8:04 pm IST

మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే ప్రధాన పాత్రల్లో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ ఆచార్య. కొణిదెల ప్రొడక్షన్ కంపనీ మరియు మాట్నీ ఎంటర్ టైన్మెంట్ పతాకాల పై ఈ చిత్రాన్ని సంయుక్తం గా నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియోలు, పాటలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి విశేష స్పందన లభించింది.

తాజాగా ఈ చిత్రం నుండి చిత్ర యూనిట్ ట్రైలర్ ను విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. టాలీవుడ్ లోనే మోస్ట్ వ్యూడ్ ట్రైలర్ గా మెగాస్టార్ ఆచార్య రికార్డు క్రికెట్ చేయడం జరిగింది. 24 గంటల్లో 24 మిలియన్ వ్యూస్ ను సాధించడం జరిగింది. ట్రైలర్ అంతా కూడా పవర్ ఫుల్ డైలాగ్స్ తో, యాక్షన్ ఎలిమెంట్స్ తో ఉండటం తో ట్రైలర్ తో సినిమా పై విపరీతమైన క్రేజ్ వచ్చింది. రామ్ చరణ్, మెగాస్టార్ చిరంజీవి లు ఇద్దరూ కలిసి నటించిన చిత్రం కావడం, ఇద్దరినీ కూడా మాస్ అండ్ పవర్ఫుల్ గా చూపించడం తో భారీ రెస్పాన్స్ వచ్చింది. ఏప్రిల్ 29 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :