‘సైరా నరసింహారెడ్డి’ కోసం భారీ సెట్టింగ్స్ !

4th, September 2017 - 08:38:08 AM


మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ ప్రస్తుతం శరవేగంగా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రియలిస్టిక్ గా తీర్చిదిద్ధేందుకు చిత్ర యూనిట్ బాగా కష్టపడుతున్నారు. ముఖ్యంగా 1840 ల నాటి వాతావరణ్నని సృష్టించేందుకు ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ కృషి చేస్తున్నారు.

ఆయన మాట్లాడుతూ ‘అపప్టి కాలానికి సంబందించిన రెఫరెన్సెస్ పెద్దగా ఏవీ లేవు. అందుకే అందుబాటులో ఉన్న పుస్తకాలు, వీడియోలో అన్నీ పరిశీలిస్తున్నాం. స్వాతంత్ర్యానికి ముందు జనజీవితం ఎలా ఉండేదో స్క్రీన్ మీద అలానే చూపించాలని ప్రయత్నిస్తున్నాం. 15 మంది టీమ్ స్కెచెస్ రెడీ చేసే పనిలో ఉన్నారు. హైదరాబాద్, రాజస్థాన్, పొల్లాచి వంటి ప్రాంతాల్లో సెట్టింగ్స్ వేయనున్నాం’ అన్నారు.

దీన్నిబట్టి చూస్తేనేగా టీమ్ సినిమాను విజువల్ వండర్ గా తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తున్నట్టు అర్థమవుతోంది. రామ్ చరణ్ స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాను సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేయనున్నారు.