‘టాక్సిక్‌’ నుంచి ఎలిజబెత్‌ గా హ్యుమా ఖురేషీ !

Toxic-movie

యశ్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘టాక్సిక్‌: ఎ ఫెయిరీ టేల్‌ ఫర్‌ గ్రోన్‌ – అప్స్‌’ సినిమా ప్రమోషన్స్ మొదలు అయ్యాయి. గీతూ మోహన్‌దాస్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో హ్యుమా ఖురేషీ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆమె ఎలిజబెత్‌ అనే పాత్రలో నటిస్తున్నట్టుగా ప్రకటిస్తూ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పాత్ర గురించి దర్శకురాలు గీతూ మోహన్‌దాస్‌ సామాజిక మాధ్యమాల్లో పలు విషయాల్ని తెలిపారు. ‘ఎలిజబెత్‌ పాత్రలో హ్యుమా వేసే ప్రశ్నలు లోతైన ఆలోచనల్ని రేకెత్తించేలా ఉంటాయి. ఒక విభిన్నమైన, బలమైన వ్యక్తిత్వాన్ని తెరపై ఆవిష్కరిస్తుంది’ అని ఆమె తెలిపారు.

గీతూ మోహన్‌దాస్‌ హ్యుమా ఖురేషీ గురించి కూడా మాట్లాడుతూ.. ‘ఇలాంటి పాత్రకు తగ్గ నటిని ఎంపిక చేయడం నాకు ఎంతో కష్టంగా అనిపించింది. ఎప్పుడైతే హ్యుమా నా ఫ్రేమ్‌లోకి అడుగు పెట్టిందో ఆ క్షణంలోనే ఆమె ప్రత్యేకతని గమనించాను. ఆమె చాలా మంచి నటి’ అని చెప్పుకొచ్చారు. వెంకట్‌ కె.నారాయణ, యశ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 19న విడుదల కాబోతుంది.

Exit mobile version