‘టాక్సిక్’ చూసి షేక్ అవ్వాల్సిందే అంటున్న బాలీవుడ్ బ్యూటీ..!

‘టాక్సిక్’ చూసి షేక్ అవ్వాల్సిందే అంటున్న బాలీవుడ్ బ్యూటీ..!

Published on Jul 7, 2026 4:00 PM IST

కన్నడ రాక్‌స్టార్ యష్ నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘టాక్సిక్’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. గీతూ మోహన్‌దాస్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించారు. ఈ సినిమాతో యష్ మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని ఈ మూవీ ప్రమోషనల్ కంటెంట్ చూస్తే అర్థమవుతుంది. ఇక ఈ సినిమాపై మరింత హైప్ ఎక్కించింది బాలీవుడ్ భామ హుమా ఖురేషీ.

‘టాక్సిక్’ సినిమాలో కీలక పాత్రలో హుమా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఆమె రీసెంట్‌గా ఈ మూవీపై కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఈ సినిమాలో చాలా మంది లేడీ స్టార్స్ నటిస్తున్నారని.. అంతమంది నటిస్తున్నారంటే ఈ సినిమాలో ఏదో మ్యాటర్ ఉంటుందిగా.. అదేంటో తెలియాలంటే ఇంకా కొద్ది రోజులు వెయిట్ చేయాలి. ఇక ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమని ఆమె పేర్కొంది.

ఈ సినిమాలో హీరోయిన్స్ అందరూ సూపర్బ్‌గా నటించారని.. అందరికీ మంచి పేరు రావడం ఖాయమని ఆమె తెలిపింది. మొత్తానికి టాక్సిక్ చిత్రంపై మరోసారి అంచనాలు పెంచేసింది ఈ బాలీవుడ్ బ్యూటీ.

తాజా వార్తలు