షాకింగ్: విజయ్ సినిమాకి సెన్సార్ కష్టాలు.. ఇప్పుడు మరొకటి!

షాకింగ్: విజయ్ సినిమాకి సెన్సార్ కష్టాలు.. ఇప్పుడు మరొకటి!

Published on Jan 6, 2026 3:25 PM IST

Jana Nayagan

ఇళయ దళపతి విజయ్ (Thalapathy Vijay) హీరోగా దర్శకుడు పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్ గా దర్శకుడు హెచ్ వినోద్ తెరకెక్కించిన అవైటెడ్ చిత్రం “జన నాయగన్”(Jana Nayagan) కోసం అందరికీ తెలిసిందే. ఈ సంక్రాంతి కానుకగా థియేటర్స్ లో రిలీజ్ కి వస్తున్న ఈ సినిమా తెలుగులో జన నాయకుడు పేరిట రాబోతుంది. అయితే ఇంకో రెండు రోజుల్లోనే థియేటర్స్ లో పడనున్న ఈ సినిమాకి లాస్ట్ మినిట్ సస్పెన్స్ తో కూడిన ఇష్యూస్ ఎదురవుతున్నాయి.

ఈ సినిమాని మేకర్స్ సెన్సార్ కి సిద్ధం చేసినప్పటికీ సెన్సార్ వారు ఇంకా సర్టిఫై చేయడం లేదట. ఈ సినిమా సెన్సార్ ఇంకా పూర్తి కాకపోవడంతో అభిమానుల్లో బుకింగ్స్ పరంగా కూడా మరింత సందిగ్ధత నెలకొంది. దీనితో మేకర్స్ మద్రాస్ హై కోర్ట్ ను సంప్రదించినట్టు కూడా తెలుస్తుంది. ఈ సినిమా ఇలా సెన్సార్ సమస్య ఒకటి అనుకుంటే విజయ్ కి మరో షాక్ తగిలినట్టు తెలుస్తుంది.

ఆ మధ్య విజయ్ భారీ సభకి గాను కరూర్ ప్రాంతంలో పెద్ద ఎత్తున తొక్కిసలాట జరిగింది. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. మరి దీనిపై విజయ్ కి సీబీఐ నోటీసులు పంపినట్టు తెలుస్తుంది. ఈ ఘటన విషయంలో విజయ్ ఈ జనవరి 12కి సీబీఐ ముందు సమాధానం చెప్పాలని వారు సూచించారట. మరి దీనిపై విజయ్ స్పందన ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు