థాయ్ ఫిల్మ్ లో ఛాన్స్ కొట్టేసిన హైదరాబాదీ గర్ల్

థాయ్ ఫిల్మ్ లో ఛాన్స్ కొట్టేసిన హైదరాబాదీ గర్ల్

Published on May 17, 2015 12:41 PM IST

Mosagallaku-Mosagadu

హీరోయిన్ గా ఒక గుర్తింపు తెచ్చుకున్నాక ఇతర భాషల్లో అవకాశాలు రావడం కామన్ గా జరిగే విషయమే.. కానీ ఒక్క సినిమాతోనే వేరే దేశానికి చెందిన భాషలో అవకాశం రావడం మాత్రం చెప్పుకోదగిన అంశమే.. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే.. హైదరాబాదీ అమ్మాయి నందిని యంగ్ హీరో సుధీర్ బాబు హీరోగా నటించిన ‘మోసగాళ్ళకు మోసగాడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు అప్పుడే ఓ థాయ్ సినిమాలో చాన్స్ కొట్టేసింది.

నందిని సైన్ చేసిన థాయ్ సినిమా ఆగష్టు నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం నందిని ఈ థాయ్ ఫైల్మ్ కోసం స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటోంది. నీలకంఠ దర్శకత్వం వహించిన మాయ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు బచ్చిన ఈ భామ కన్నడలో గుండెజారి గల్లంతయ్యిందే రీమేక్ లో నటించింది. ప్రస్తుతం గ్రహణం అనే తమిళ సినిమాలో నాటిస్తోంది. ఇదిలా ఉంటె మే 22న విడుదలకు సిద్దమవుతున్న మోసగాళ్ళకు మోసగాడు సినిమా మంచి తనకి మంచి బ్రేక్ ఇస్తుందని భావిస్తోంది.

తాజా వార్తలు