సోషల్ మీడియాలో హీరోయిన్స్ పై అలాంటి కామెంట్లు జైలుకే..!

సోషల్ మీడియాలో హీరోయిన్స్ పై అలాంటి కామెంట్లు జైలుకే..!

Published on Dec 6, 2019 9:20 AM IST

ఇకపై నెటిజెన్స్ సోషల్ మీడియాలో చేసే కామెంట్స్, పెట్టే పోస్ట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. భావ ప్రకటనా స్వేచ్ఛ ఉంది కదా అని వ్యక్తులపై, సున్నిత సంఘటనలపై ఇష్టం వచ్చిన కామెంట్స్ పెడితే జైలు ఊచలు లెక్కపెట్టాల్సిందే. ముఖ్యంగా హీరోయిన్స్ ని టార్గెట్ చేస్తూ అసభ్యకరమైన కామెంట్స్ పోస్టులు పెట్టేవారిపై సైబర్ పోలీసులు కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు. ఇటువంటి చర్యలను ఆన్లైన్ హరాస్మెంట్ గా పరిగణలోనికి తీసుకొని కేసులు నమోదు చేస్తున్నారు.

తాజాగా హైదరాబాద్ లో దిశా హత్య మరియు హత్యాచార ఘటన విషయంలో బాధితురాలి క్యారెక్టర్ అలాగే అమ్మాయిల కట్టు, బొట్టు వంటి విషయాలపై అసభ్యకర కామెంట్స్ చేసిన కొందరిని హైదరాబాద్ సైబర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ప్రముఖ యాంకర్ మరియు నటి అనసూయ ఇలాంటి వారిపై సోషల్ మీడియా వేదికగా కఠిన పదజాలంతో మండిపడ్డారు. మా క్యారక్టర్, వేసుకొనే బట్టలు, అలంకరణను డిసైడ్ చేయడానికి మీరెవరని ఆక్రోశం వెళ్లగక్కారు. ఇటీవల కొందరు హీరోయిన్స్ సోషల్ మీడియా వేదికలైన ట్విటర్ ఇంస్టాగ్రామ్ ల ద్వారా అభిమానులతో చాట్ చేస్తున్న సందర్భంలో కొందరు ఆకతాయిలు అడగకూడని ప్రశ్నలు అడుగుతూ మానసికంగా హింసకు గురిచేశారు. నివేదా థామస్ మరి కొందరికి ఇలాంటి సమస్య ఎదురైంది. చాట్ ముగించిన తరువాత వాళ్లు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది.

ఇలాంటి నీచ సంస్కృతిని అదుపు చేయాలనే ఉద్దేశంతో సైబర్ పోలీసులు కఠిన నిర్ణయాలు తీసుకోనున్నారని సమాచారం. సామాజికంగా సున్నితమైన విషయాలపై, అలాగే సెలెబ్రిటీస్ ని టార్గెట్ చేస్తూ అసభ్యకర పోస్టులు, కామెంట్స్ పెడితే తక్షణమే అరెస్ట్ లు జరుగుతాయట. కాబట్టి నోటిని, బుద్ధిని అదుపులో ఉంచుకొని ఆన్లైన్ లో ప్రవర్తించాలి, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు