
విడుదలైన రోజు నుండి నేటి వరకు శంకర్ దర్శకత్వం వహించిన విజువల్ వండర్ ‘ఐ’, బాక్సాఫీస్ వద్ద భారి కలెక్షన్స్ రాబడుతుంది. సినిమా పట్ల విమర్శకులు, కొందరు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన లభించినా, సంక్రాంతి సెలవులు మంచి వసూళ్లు రాబట్టడంలో హెల్ప్ అయ్యాయి. తమిళంలో ఈ సినిమా కోట్లు కొల్లగోడుతుంది. తెలుగులో సైతం ‘ఐ’ సినిమా కలెక్షన్స్ డీసెంట్ గా ఉన్నాయి. కేరళలో బాక్సాఫీస్ రికార్డులు సృష్టిస్తుంది.
కేరళ బాక్సాఫీస్ ట్రేడ్ పండితులు చెప్తున్న సమాచారం ప్రకారం.. కేరళలో మొదటి రెండు రోజుల్లో అక్కడ ఉన్న అన్ని రికార్డులను ‘ఐ’ సినిమా చెరిపేసింది. సరికొత్త రికార్డులు సృష్టించింది. ఇప్పటివరకూ మలయాళంలో ‘ఐ’ సినిమా 5.57 కోట్లు వసూలు చేసింది. పర భాషా చిత్రాలు ఇంత పెద్ద మొత్తంలో వసూలు చేయడం ఒక రికార్డు. మలయాళ నటుడు సురేష్ గోపి, ‘ఐ’లో కీలక పాత్ర చేయడంతో అక్కడ ప్రేక్షకులు సినిమాను బాగా ఆదరిస్తున్నారు. వారం రోజుల్లో 10 కోట్ల మేజిక్ ఫిగర్ ను త్వరలో చేరుకుంటుందని అక్కడ ట్రేడ్ పండితులు చెప్తున్నారు.
కేరళలో ఈ సినిమా మొత్తం 232 స్క్రీన్లలో విడుదలైంది. విక్రమ్, అమీ జాక్సన్ లు కేరళలో ముఖ్య నగరాలలో ప్రమోషన్ భారిగా చేయడం, పోటిలో మరో సినిమా లేకపోవడంతో ‘ఐ’ సినిమాకు భారి వసూళ్లు వచ్చాయి.