ఇంటర్వ్యూ: శ్రీవిష్ణు – నాకు మాస్ హీరో అయిపోవాలనే కోరిక రాలేదు !

ఇంటర్వ్యూ: శ్రీవిష్ణు – నాకు మాస్ హీరో అయిపోవాలనే కోరిక రాలేదు !

Published on Mar 19, 2018 1:40 PM IST

హీరో శ్రీవిష్ణు నటించిన తాజా చిత్రం ‘నీది నాది ఒకే కథ’. ఈ నెల 23న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ సందర్బంగా శ్రీవిష్ణు మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం..

ప్ర) సినిమా ఎవులా ఉండబోతోంది ?
జ) ఈ సినిమా చాలా రియలిస్టిక్ గా ఉంటుంది. అంటే సినిమాలో నన్ను చూస్తే చాలా మంది కుర్రాళ్ళు వాళ్ళను వాళ్ళు చూసుకుంటున్నట్టు ఉంటుంది. అంతలా కనెక్ట్ అవుతుంది సినిమా.

ప్ర) అసలు సినిమా కథేంటి ?
జ) చదువు సరిగా ఎక్కని కుర్రాడి జీవితంలో చదువు పూర్తైనప్పటి నుండి సెటిలయ్యే వరకు ఏం జరిగింది అనేదే సినిమా కథ.

ప్ర) ఈ కథలో తండ్రి పాత్ర ప్రముఖంగా కనిపిస్తోంది. దాని గురించి చెప్పండి ?
జ) హీరో పాత్రతో పాటు తండ్రి పాత్ర చాలా ముఖ్యం. డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ గారు ఈ పాత్రను చేశారు. నా పాత్రతో కుర్రాళ్ళు రిలేట్ అయితే ఆయన పాత్రతో పెద్ద వాళ్ళు కనెక్ట్ అవుతారు.

ప్ర) కొత్త డైరెక్టర్ వేణు ఊడుగుల ఎలా చేశారు ?
జ) ఆయన మొదటి నుండి సినిమా మీద ఫుల్ క్లారిటీతో ఉన్నారు. చాలా బాగా చేశారు.

ప్ర) ఎక్కువగా మాస్ క్యారెక్టర్లే చేస్తున్నారు. మాస్ హీరో అవ్వాలనుకుంటున్నారా ?
జ) కథ నచ్చే సినిమాలు చేస్తున్నాను. అంతేగాని మాస్ హీరో అయిపోవాలనేం లేదు. అయినా మాస్ హీరో అవ్వడమంటే సామాన్యమైన విషయం కాదు. చాలా కష్టం.

ప్ర) ఈ సినిమాలో డోగ్మే 95 టెక్నిక్ వాడారట కదా.. దాని గురించి చెప్పండి ?
జ) అది 1995 టెక్నిక్. అందులో బడ్జెట్ లేకుండా సినిమా తీయడం ఎలా అనేది కాన్సెప్ట్. దాన్ని ఉపయోగించే సినిమా తీశాం. అంటే పెద్ద పెద్ద సెట్స్, ఎక్యూప్మెంట్స్ లాంటివి వాడకుండా చాలా తక్కువలో చేశాం. తెలుగులో ఆ టెక్నిక్ వాడి తీసిన మొదటి సినిమా ఇదే.

ప్ర) ఈ సినిమా ఎందుకింత ఆలస్యమైంది ?
జ) అంటే.. ఒకటిన్నర సంవత్సరం క్రితమే సినిమాని మొదలుపెట్టాం. మధ్యలో ‘మెంటల్ మదిలో’ పనుల్లో బిజీ అవడం వలన కొద్దిగా ఆలస్యమైంది.

ప్ర) ఇకముందు ఎలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నారు ?
జ) కమర్షియల్ సినిమాలు కాకుండా డిఫరెంట్ సబ్జెక్ట్స్ చేయాలనేది నా కోరిక. ఎక్కువగా అలాంటి సినిమాలే చేస్తాను.

ప్ర) మీ తరవాతి ప్రాజెక్ట్స్ ఏంటి ?
జ) ప్రస్తుతం ‘వీరభోగ వసంతరాయలు’ చేస్తున్నాను. దాని తరవాత ‘అసుర’ దర్శకుడితో ‘తిప్పరా మీసం’ ఉంది. దాని తరవాత కొత్త డైరెక్టర్ తో ఒక పోలీస్ స్టోరీ చేస్తాను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు