చిరు, పవన్ ల కటౌట్ ని బెడ్ రూంలో పెట్టుకున్న వరుణ్ తేజ్

చిరు, పవన్ ల కటౌట్ ని బెడ్ రూంలో పెట్టుకున్న వరుణ్ తేజ్

Published on Mar 4, 2015 2:01 PM IST

varun-tej
మెగా స్టార్ ఫ్యామిలీ నుంచి గత ఏడాది హీరోగా పరిచయమైన హీరో వరుణ్ తేజ్. నాగ బాబు తనయుడైన వరుణ్ తేజ్ ‘ముకుంద’ సినిమాతో కమర్షియల్ గా పెద్ద సక్సెస్ అందుకోకపోయినా పెర్ఫార్మన్స్ పరంగా మాత్రం మంచి మార్కులే పడ్డాయి. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వరుణ్ తేజ్ తనకు మెగా హీరోలతో ఉన్న అనుబంధాన్ని గురించి తెలియజేశాడు. ‘నేను చిన్నప్పటి నుంచి పెదనాన్న గారి సినిమాలు చూసే పెరిగాను. చిన్నప్పుడు నా బెడ్ రూంలో పెదనాన్న, బాబాయ్ లది ఫుల్ సైజ్ కటౌట్ లా ఒక పోస్టర్ ఉండేది. సినిమాల్లోకి రావడానికి వాళ్లిద్దరే నాకు స్ఫూర్తి. నాన్న ఎప్పుడు పెదన్న హార్డ్ వర్క్ గురించి చెప్తుంటారని’ వరుణ్ తేజ్ అన్నాడు.

అలాగే రామ్ చరణ్, అల్లు అర్జున్ ల గురించి మాట్లాడుతూ ‘రామ్ చరణ్ అల్లు అర్జున్ లతో నాకు ఏజ్ గ్యాప్ ఉండడం వల్ల క్లోజ్ నెస్ తక్కువగా ఉంటుంది. నేను చరణ్ తో ఎప్పుడు కలిసినా వర్క్ గురించే మాట్లాడుకుంటాం. అల్లు అర్జున్ నాకు సలహా ఇచ్చారు. ఒక స్క్రిప్ట్ ని ఫైనలైజ్ చేసే ముందు చాలా కథలు విను, తర్వాతే ఫైనలైజ్ చెయ్ అని చెప్పిన సలహా నాకు ఎంతో హెల్ప్ అయ్యిందని’ అన్నాడు. వరుణ్ తేజ్ తన తదుపరి సినిమా క్రిష్ డైరెక్షన్ లో చేయనున్నాడు. ‘కంచె’ అనే టైటిల్ ఫిక్స్ చేసిన ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు