పవన్ నుండి విడిపోయాక చాలా సంవత్సరాలు పిల్లలతో కలిసి ఒంటరిగానే ఉంటూ వచ్చిన రేణు దేశాయ్ ఈ మధ్యే తన కొత్త జీవిత భాగస్వామిని ఎంచుకుంది. దీనిపై సోషల్ మీడియాలో ఆమెను వ్యతిరేకించే వారే ఎక్కువగా తయారయ్యారు. దీంతో విసిగిపోయిన రేణు దేశాయ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ…పవన్ కళ్యాణే విడాకులు ఇవ్వాలని కోరారని చెప్పుకొచ్చారు.
దీంతో పవన్ అభిమానులు కొందరు రేణు దేశాయ్ ను సోషల్ మీడియాలో మళ్ళీ ట్రోల్ చేయగా, తాజాగా ఆమె స్పందిస్తూ…‘ 2012 మార్చి 13వ తేదీన బేబీ పోలినా పుట్టింది. ఆ తర్వాత మూడు రోజులకు 2012 మార్చి 16న తనకు పవన్ విడాకులు ఇచ్చారు. అంటే 2011 జులైలోనే పవన్ మూడో భార్య అన్నా లెజినోవా గర్భందాల్చింది.’ అని రేణు దేశాయ్ పోస్ట్ చేశారు. తనకు కొన్ని మెసేజ్ లు వస్తున్నాయని, మా విడాకుల మీద కొందరు గందరగోళాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని, అందుకే నేను ఈ వివరణ ఇవ్వాలనుకున్నానని రేణు దేశాయ్ చెప్పారు.


